Friday, 31 July 2026 10:28:21 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వ కళాశాలలను సద్వినియోగపరచుకోవాలి

ప్రిన్సిపల్ ( ఎఫ్ ఏ సి) ఉషా

Date : 23 January 2026 04:34 PM Views : 168

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వ కళాశాలలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ (ఎఫ్ ఏ సీ)ఉషా అన్నారు. శుక్రవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు నడుస్తున్నాయన్నారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు, యోగ, ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థి యొక్క సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఉదయం సాయంత్రం సమయంలో సైతం స్టడీ అవర్స్ చేపడుతున్నామన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటుకు వెళ్లే బదులు ప్రభుత్వ కళాశాలలో చదివిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కళాశాల నుండి గుండోజు శ్రీజ జిల్లాలో మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల సహకారం ఉంటేనే ఇలాంటి ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులను వినియోగించుకొని విద్యార్థులు తమ సామర్థ్యాలకు మెరుగుపెట్టాలన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి, తిరుమల్, శశాంక్, నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి, శ్రీదేవి, సబిత, మౌనిక, సురేష్ , దీపారాణి సిబ్బంది అనసూయ, ప్రభాకర్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :