Thursday, 30 July 2026 10:15:27 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

శ్రీ భగవాన్ బీర్స ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీ నాయకులు

Date : 16 November 2025 08:23 AM Views : 314

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనం నందు శ్రీ బిర్స ముండా 150వ జయంతి వేడుకలను ఆదివాసీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు ఆయనవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ మండల అధ్యక్షులు కొరెత తిరుపతి మాట్లాడుతూ బిర్స ముండా అతి చిన్న వయసులోని ఆంగ్లేయులపై పిడికిలి బిగించిన ఆయన ధైర్య సాహస పోరాటాలు స్కరించుకుంటూ భారత్ ప్రభుత్వం జన్ జాతియ గౌరవ్ దివస్ ప్రకటించిందన్నారు. ఉద్యమానికి ప్రాణం పోసిన మహోన్నత వీరుడు గిరిజనుల స్వాతంత్రం యుద్ధ దిక్సూచి ప్రేమతో ప్రజల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయాయి అన్నారు. ఆయన చూపిన ధైర్యం నిస్వార్ధ సేవా మార్గం పోరాటం గిరిజనుల గౌరవం అణగారిన వర్గాల హక్కుల కోసం నిబద్ధత ముందుకు సాగిన పోరాటం నేటికీ మనకు ఆదర్శం ప్రతి ఒక్కరు బీర్స ముండా పోరాట ఉద్యమాలు ఆదర్శంగా తీసుకొని ఆదివాసి చట్టాలు హక్కుల సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధి కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆదివాసి సమాజానికి తెలియజేస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిడం సక్కరం, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ్య, కొలవార్ ఉపాధ్యక్షులు మనేపెళ్ళి మల్లేష్, కొలావార్ జిల్లా యువజన అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి కొరెత లలాయ, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, కార్యవర్గ సభ్యులు కుర్సింగ శంకర్, పెద్దల శకర్, పోర్సేటి సర్ధాజి, మల్లేష్, తోగయ, సిడం షణ్ముఖ, నాయిని స్వామి, కొలవార్ జిల్లా సహాయక కార్యదర్శి పోల్క వెంకటేష్ మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పంచాయతీ కార్యదర్శులు పేధం తుక్కరం, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :