ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చదువుల తల్లిసావిత్రి బాయి పూలే వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పోరాట స్పూర్తితో మహిళా అభ్యున్నతికి కృషి చేస్తానని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే వర్ధనతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూసంఘ సంస్కర్త, విద్యాప్రదాత, మాత సావిత్రి బాయి పూలే జీవితం ఒక పాటంగా తీసుకోవాలన్నారు. మారుతున్న సామజిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్థికంగా, సామజికంగా ఎదుగుదలకు అన్ని వర్గాలు కృషి చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తొగరు రాజు, పెండెం రాజశేఖర్, ఆకెనపల్లి శిల్పతి, సీనియర్ నాయకులు చాతరాజు రాజన్న, శెనిగరపు లింగన్న, లింగంపల్లి వెంకటేష్, వేముల ప్రేమ్ సాగర్, సామనపల్లి కిషన్, బీసీ నాయకులు హనుమాండ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News