Friday, 31 July 2026 10:00:48 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ..

Date : 25 March 2026 09:50 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడు గులు వేస్తున్న విషయం తెలిసిందే, అయితే కవితకు రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చిన జిల్లా అయినా నిజామాబాద్, అడ్డాగా ఆమె పెట్టబోయే పార్టీకి మొదటి అడుగు పడనుందట. తెలంగాణ ప్రజా జాగృతి పేరును ఆమె రాజకీయ పార్టీగా ఏర్పాటుచేయనున్నారు. త్వరలోనే నూతన రాజకీ య పార్టీని ప్రకటించబోతు న్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ అజెండాపై ప్రస్తుతం లోతైన కసరత్తు జరుగుతోందని కవిత వెల్లడించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాం తాన్ని తాను లోతుగా అధ్యయనం చేస్తున్నానని, అదే అజెండాతో ముందు కు వెళ్తామని పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసు కుని పార్టీ పేరును, ఇతర వివరాలనుఅధికారికంగా ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ఇప్పటికే పార్టీ పేరు విషయంలో అన్నీ సెట్ అవుతున్నా యని, కార్యాలయం కోసం స్థలాన్ని కూడా అన్వేషిస్తు న్నామని ఆమె వివరించారు. తన రాజకీయ పోరాటం ఎవరితో ఉండబోతోందో కవిత సూటిగా చెప్పారు. డాడీ, మోడీ, చిన్న మోడీ పైనే తన పోరాటం ఉంటుం దని ఆమె ప్రకటించారు. తనకు ఎవరితోనూ రాజీ లేదని, తన కొత్త పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ , సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి తర్వాత పార్టీ ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని కవిత తెలిపారు. చాలా మంది జాతీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు కూడగడతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువతకు తన పార్టీలో పెద్దపీట వేస్తానని ప్రకటించారు. తనకు ఎలాంటి బేషజాలు లేవని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నూతన పార్టీ ప్రభావం ముఖ్యంగా ఆది లాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఆమె విశ్లేషించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా చాలా చోట్ల నుంచి తనను పోటీ చేయా లని ప్రజలు కోరుతున్నార ని, రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని ఆమె వెల్లడించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :