Friday, 31 July 2026 10:21:48 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి...

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి. రాములు

Date : 18 June 2026 10:11 PM Views : 66

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని ఎల్.పి.జి. వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా గ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఎల్.పి.జి. వినియోగదారుల బ్యాంకు ఖాతాలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయని వినియోగదారులు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయని వినియోగదారులకు రాయితీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.ఎల్.పి.జి. రీఫిల్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రేషన్ కార్డుదారులు ఈ-కె వై సి పూర్తి చేయాలి.. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కెవైసి పూర్తి చేయాలని తెలిపారు.జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ప్రతి రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈ-కెవైసి పూర్తి చేయడం తప్పనిసరి అని తెలిపారు.రేషన్ కార్డులో ఉన్న సభ్యుల పారదర్శకతను నిర్ధారించడానికి,నకిలీని నిరోధించడానికి,అర్హత కోల్పోయిన వారిని గుర్తించి రికార్డులను నవీకరించేందుకు ఈ- కెవైసి ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు.ఇప్పటివరకు ఈ-కెవైసి చేయించుకోని రేషన్ కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణాలను సందర్శించి,అక్కడ ఏర్పాటు చేసిన ఇ పి ఓం ఎస్ యంత్రం ద్వారా వెంటనే పూర్తి చేయించుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: