Friday, 31 July 2026 02:11:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అవినీతి వలలో మరో చేప చిక్కింది..

రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ ఇంజనీర్.

Date : 14 July 2026 10:07 PM Views : 78

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారంఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలోపెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నట్లుఅధికారులు తెలిపారు. ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఏఈ సతీష్ ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంతరం విచారణ కోసం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు.అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో పెద్దపల్లి కలకలంరేగింది. అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఏసీబీ అధికారులు ప్రతి నెలలో కొంతమంది అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్న కూడా ఇంకా లంచం తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలా లంచాలకు ఎగబడితే మామూలు ప్రజల పరిస్థితి ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏసీబీకి పట్టుబడిన అధికారులను ఉద్యోగాల నుండి తొలగిస్తే నన్న మార్పు వస్తుందేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :