ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గోదావరి అర్బన్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ధనంజయ్ తంబేకర్ జన్మదినం పురస్కరించుకుని మంథని గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ నాగుల రమేష్ గురువారం మంథనిలో నిరుపేదలకు ఆహారపదార్థాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ రమేష్ మాట్లాడుతూ తమ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ధనంజయ్ తంబేకర్ ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది మరియు గోదావరి అర్బన్ (లీగల్ అడ్వైసర్ ) బోట్ల ఆంజనేయులు, గోదావరి అర్బన్ బ్యాంక్ సిబ్బంది లక్కాకుల శంకర్ కె.శిరీష , కె గణేష్ , కె సాయిరాంలు పాల్గొన్నారు.
Admin
E Nivas News