ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు సదస్సులో పాల్గొని మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని రంగపేట కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చిప్పకుర్తి నారాయణ ఇంట్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సహాపంక్తి భోజనం చేశారు.మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,జీవన్ రెడ్డి, విజిత్ రావు ఇతర నాయకులు సైతం ఈ సహాపంక్తి భోజనంలో పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ తమ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు కెసిఆర్ ఆధ్వర్యంలో అధిక ప్రాధాన్యత ఇస్తామని, కాంగ్రెస్ నాయకులబెదిరింపులకు భయపడవద్దని, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని అంతకుముందు జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రేమ్ సాగర్ రావును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News