ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెట్టిపేట మండల గ్రామస్థాయి పోటీలు ఫిబ్రవరి 2 న దౌడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో సరోజ, తాసిల్దార్ దిలీప్ కుమార్, మండల విద్యాధికారి శైలజ, జిల్లా వ్యాయామ సంఘం అధ్యక్షుడు బండజీవరత్నం, ఎస్సై సురేష్ తెలిపారు. ఈ పోటీలు వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్ నందు జూనియర్స్, సీనియర్స్ విభాగం లో జరుగుతాయన్నారు. లక్షెట్టిపేట మండల గ్రామ పంచాయతీ పరిధిలో గల క్రీడాకారులు తమ యొక్క ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పత్రం తో ఫిబ్రవరి 2 ఉదయం 9.00 గంటలకు హాజరు కావాలన్నారు. అదే విధంగా ఎంపిక కాబడిన క్రీడాకారులు నియోజకవర్గం స్థాయి పోటీల లో పాల్గొంటారని తెలిపారు. మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రేషన్ చేసుకోబడిన క్రీడాకారులను సమయానికి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వివరాలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, పిడి శ్రీకాంత్ మొబైల్ నెంబర్ 7989886085 కు సంప్రదించాలన్నారు. మండలం లో గల అన్ని పాఠశాలల వ్యాయమ ఉపాధ్యాయులు తప్పకుండా పాల్గొనాలని తెలిపారు.
Admin
E Nivas News