ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని (నిపుణుడు) మోటివేటర్ ఎం. జయ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం మహాత్మ జ్యోతి బా పూలే బాలుర గురుకుల పాఠశాల నందు 8,9 మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పీఎం శ్రీ కార్యక్రమాలలో భాగంగా నిపుణుల చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం. జయ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు తెలిపారు. ఎలాంటి నిరాశ నిస్పృహలను దరి చేరనీకుండా కృషి చేయాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులు రాబోయే వార్షికపరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలని పరీక్ష రాసేటపుడు తీసుకునే జాగ్రత్తలు వివరించారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జయ కృష్ణారెడ్డిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మంగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News