ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తుందని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శాసనసభలోజరుగుతున్న పరిణామాలను చూసి రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిఅనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తాను 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అప్పటి నుంచి అసెంబ్లీ తీరు ఇలా లేదని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడేటప్పుడు సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేస్తూ “టీ విరామం” తీసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పరుషంగా చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించలేదని మండిపడ్డారు. ఇలా అయితే ప్రజలంతా ఎలా ఆలోచిస్తారా అని నాయకులు అర్థం చేసుకోవాలన్నారు.
Admin
E Nivas News