ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ ప్రతిష్టాపన పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారం భోత్సవం చేసి ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ దేవాలయాల పునరుద్ధరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక ప్రగతి, పర్యా టక అవకాశాలు పెరుగుతాయన్నారు. కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలి పారు. ఆలయ పునర్ ప్రతి ష్టాపన అనంతరం భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం ద్వారా గ్రామాభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణరావు, దేవాదా యశాఖ కమిషనర్ హరీష్, ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News