ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రేమను తిరస్కరించాడనే కోపంతో ఓ మహిళ తన భర్త, బంధువులతో కలిసి ప్రేమించిన వ్యక్తిని హత్య చేయించిన ఘటన రామగిరి మండలంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన కోట చిరంజీవి (35) పోతన కాలనీలో మీసేవ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఆరు సంవత్సరాల క్రితం ఆయన భార్య మరణించింది. ఈ క్రమంలో, పెంచికల్పేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ (ఇద్దరు పిల్లల తల్లి) కంప్యూటర్ నేర్చుకోవడం కోసం చిరంజీవి సెంటర్‌కు వచ్చేది. ఇద్దరూ క్లాస్మేట్లు కావడంతో మహిళ చిరంజీవిపై మమకారం పెంచుకొని, తన భర్తను, పిల్లలను వదిలి వస్తానని, ఇరువురం వివాహం చేసుకుని కలిసి ఉందామని ఒత్తిడి చేసిందట. అయితే చిరంజీవి ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. కాగ శుక్రవారం మహిళ చిరంజీవికి ఫోన్ చేసి, తాను పనిచేస్తున్న రామగిరి డిఆర్డిఏ టీసెర్ప్ కార్యాలయానికి పిలిపించగా ఒక్కడే వెళ్లిన చిరంజీవినీ ఆమె భర్త కుమార్, అన్న అనవేన నరేష్, తండ్రి మల్లయ్య, బంధువు పిడుగు చందులతో కలిసి చిరంజీవిపై దాడి చేసి, తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రామగిరి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Admin
E Nivas News