Thursday, 30 July 2026 08:54:30 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తాం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 01 February 2026 08:22 AM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈవీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 60 శాతం జరిగి నట్లు తెలిపారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపా రు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఇంటి నుండి ఖచ్చితమైన వివరాలు సేకరిస్తామని అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసేలా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను నిర్ధారించి, శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లును వెంటనే నియమించుకునేలా చర్యలు తీసు కుంటామని అన్నారు. మ్యాపింగ్ సమయంలో త ప్పు ఎంట్రీలు, తప్పు లింకింగ్‌లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్ల సౌలభ్యం కొరకు బుక్ ఎ కాల్ విస్తృతప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఓట రు పేరు సరైన పోలింగ్ స్టేషన్‌కు మ్యాప్ కావడం ప్రజాస్వామ్యానికి కీలక మని అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ పడాల అశోక్ కుమార్, ఎన్నికల వి భాగం పర్యవీక్షకులు అ బ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :