ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం ఆద్వర్యంలో శుక్రవారంపర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా మాతృ వృక్షస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోనిరావిచెట్టును మాతృవృక్షంగా గుర్తించారు. దాని సాక్ష్యంగా ప్రకృతిని కాపాడాలని జీవ వైవిధ్యాన్ని రక్షించాలని ప్రిన్సిపాల్ , బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులూ కలసి పర్యావరణాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతూ చెట్లను ఆరాధించడం, సంరక్షించడం మన సంప్రదాయమని విద్యార్థులూ ప్రతి ఒకరు కళాశాలలో పరిశుభ్రత పర్యావరణం పచ్చదనం పట్ల బాధ్యత వహించాలనిపేర్కోన్నారుస్వచ్ఛమైన ఆరోగ్యమైన వాతావరణం మనం అనుభవించాలి అదేవిధంగా రాబోయే తరాలకు అందించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, శంకరయ్య,సంధ్యారాణి, శ్రీనివాస్,స్వప్న, కవిత, రాజేశం, బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, నిషాంత్, శంకర్, సునీతా లతా పాల్గొన్నారు.
Admin
E Nivas News