ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ముఖాశీర్ హుస్సేన్ కిడ్నీ దానం చేస్తున్న వారి సతీమణి కి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో జరుగనున్న కిడ్నీ మార్పిడి చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.2.50 లక్షల ఎల్ ఓ సి లెటర్ ను పేషంట్ కు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి చికిత్స లాంటి పెద్ద శస్త్ర చికిత్సలకు కూడా నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఉన్నాయని, వాటిని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.
Admin
E Nivas News