Friday, 31 July 2026 01:20:06 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్

సి పి సాయి చైతన్య

Date : 08 February 2026 07:53 PM Views : 123

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలు పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్, భీంగల్ లోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు పాదయాత్రగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈసందర్భంగాపోలీసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటిభయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్య తలెత్తిన పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఫ్లాగ్ మార్చిన వలన ఎన్నికలవేళ ప్రజల్లో భద్రతాభావం , నమ్మకం పెరుగుతుందని , పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఫ్లాగ్ మార్చ్ లో ఏసీపీలు, సిఐలు , ఎస్.ఐ లు , క్యూ.ఆర్.టి సిబ్బంది , ఆర్ముడు రిజర్వ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :