Friday, 31 July 2026 01:15:09 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మీ బ్యాంకు అకౌంట్ నుంచే ట్రాఫిక్ చలాన్లు కట్ అవుతాయి...

సిఎం రేవంత్ రెడ్డి

Date : 13 January 2026 10:13 PM Views : 174

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వాహనదారులు నిబంధన లకు విరుద్దంగా వాహనం నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారని కాగాఆ చలాన్లను మనకు వీలున్న ప్పుడు చెల్లించుకునే అవకాశం ఉండేదని మరీ ఎక్కువ చలాన్లు పడితే వాహనాలను ట్రాఫిక్ పోలీ సులు సీజ్ చేసేవారన్నారు.త్వరలో చలాన్ల వసూళ్ల విషయంలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విధానం ద్వారా మీ వాహనంపై చలాన్ పడిన కొద్దిసేపటికే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయని తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో సోమవారం సాయంత్రం అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథి గా పాల్గొని మాట్లాడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన దారులపై కఠినంగా వ్యవ హరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని, దీనికి మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నపడం వంటి ప్రధాన కార ణాలు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి, ఓ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. ఇందుకోసం వాహనం రిజిస్ట్రేషన్సమయంలోనే యాజమాని బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. ఏదైనా నిబంధన అతిక్రమించి చలాన్ పడితే జరిమానా మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యేలా సాంకేతికతను తీసుకురావాలని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది పాఠశాల దశ నుంచే అలవడాలని. విద్యార్థుల సిలబస్‌లో రోడ్డు భద్రత అంశాలను చేర్చాలని విద్యాశాఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వ యంతో పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాద రహిత తెలం గాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రోడ్డు భద్రత విభాగంలో పనిచేయడాన్ని శిక్షగా భావించే ధోరణిని మార్చాలని సీఎం రేవంత్ అన్నారు. ఇకపై ఈ విభాగా నికి డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించిఈ రంగాన్ని హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాలో శక్తివంతంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :