Thursday, 30 July 2026 07:18:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే.

Date : 23 June 2026 12:22 AM Views : 75

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పలకరించి వారి ఆరోగ్యపరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు మెరుగైన సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. ఆసుపత్రి పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా ఆసుపత్రి లోపలికి ప్రవేశించే సమయంలో చెప్పులు బయట విడిచి రావాలని వైద్యులకు సూచించారు. అనంతరం లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రోడ్డు వెడల్పు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఎవరి అడ్డంకులు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, తాసిల్దార్ దిలీప్ కుమార్ , చైర్మన్ దొంత అంజలి - నర్సయ్య, మోత్కూరి రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్ , కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్లా నాగభూషణం , పూర్ణచంద్రరావు , ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :