ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య గజీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా పోస్టర్‌ను శుక్రవారం ఆసిఫాబాద్ కేంద్రం కొట్నాక భీంరావ్ పిల్లలు పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిల గురించి స్థితిగతుల గురించి ఈ సినిమా తీయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, బారాస నాయకురాలు మర్సకోల సరస్వతి,గంధం శ్రీను,నిస్సార్ భాయ్,జీవన్, సినిమా టీమ్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News