ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు కుటుంబ సభ్యుల తో కలిసి హాజరు కావాలని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ లను మంత్రి సీతక్క, వనదేవతల పూజారులు అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి ఆహ్వానించారు. మంత్రులకు అమ్మ వార్ల జాతర ఆహ్వాన పత్రిక, బంగారం ప్రసాదాన్ని అందజేసారు. మంత్రి సీతక్క వెంట వన దేవతల పూజారులు కాక వెంకటేశ్వర్లు, సిద్దబోయిన జగ్గారావు, కాక సమ్మయ్య తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News