Thursday, 30 July 2026 12:30:16 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ర్యాగింగ్‌ భూతం నుండి విద్యార్థుల భద్రతకి అత్యంత ప్రాధాన్యత..

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 14 November 2025 06:50 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ర్యాగింగ్ భూతం నుండి విద్యార్థులకు అత్యంత భద్రత కల్పిస్తామని రామగుండం సిపి తెలిపారు. మెడికల్ కళాశాల లో ర్యాగింగ్‌ అనే ఆలోచన విద్యార్థులలో లేకుండా పూర్తిగా నిరోధించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని లోని సింగరేణి మెడికల్ కళాశాలలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, పెద్దపల్లి జోన్ షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య సాన్నిహిత్యం, ఒకరిపై ఒకరు గౌరవం, ర్యాగింగ్ వల్ల తీసుకొనే చట్టపరమైన చర్యలు, శిక్షలు, ర్యాగింగ్ కి పాల్పడడం వలన కలిగే వ్యక్తిగత హానికర పరిణామాల గురించి, బాధితులకు అందుబాటులో ఉన్న పోలీస్ హెల్ప్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గోదావరిఖని ఎసీపీ రమేష్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లకు సహాయం చేయాలి, మార్గనిర్దేశనం ఇవ్వాలి, ప్రోత్సహించాలి ,బాధ పెట్టరాదు.క్రమశిక్షణ, మంచి సత్ససంబంధాలు, పరస్పర గౌరవం, ఎలాంటి భయలు లేకుండా, సురక్షితమైన వాతావరణంలో అందరూ కలిసి ఉండాలని ఎసీపీ రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ర్యాగింగ్ కి పాల్పడడం అనేది ఏ రూపంలోనైనా నేరం. ర్యాగింగ్ కి పాల్పడితే కేసులు నమోదు చేసి, జైలుశిక్ష, కళాశాల నుండి సస్పెన్షన్,తొలగింపు వరకూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సీపీ అన్నారు. మీ తల్లితండ్రులు మీపై పెట్టుకొన్న ఆశలు, కన్నా కలలు, మీరు ఎంచుకొన్న లక్ష్యాలు అర్ధతరంగా ముగిసిపోయి మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే ఆత్మస్థైర్యం కోల్పోవడం, తరగతులకు రావడానికి భయపడడం, మానసికంగా కృంగిపోయి బాధపడకుండా ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా వెంటనే పోలీసులకు,యాంటీ ర్యాగింగ్ కమిటీకి సమాచారం ఇవ్వాలి అని సూచించారు. దేవుని ప్రార్థిస్తే వరాలు ఇస్తాడో లేడో కానీ, *"వైద్యో నారాయణ హరి"* అంటే వైద్యులు నారాయణునితో (దేవునితో) సమానమని అర్థం. ఈ సూక్తి వైద్య వృత్తి యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, మరియు వైద్యులు మానవ జీవితాన్ని రక్షించే దైవంతో సమానమని అందరి నమ్మకం కాబట్టి ఏలాంటి డ్రగ్స్ లకు అలవాటు పడడం కానీ, ర్యాగింగ్ పేరుతో ఇతరులని మానసికంగా బాధ పెట్టడం కానీ, ఇతరులు ఇబ్బంది పడేలాగా చేయడం గానీ, గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఏలాంటి ప్రమాదం పొంచి ఉన్నదనేది మీకు బాగా తెలుసు, అలాంటి వాటికి ఎవరైనా మీ తోటి వారు ఆకర్షితులు కాకుండా బంగారు భవిష్యత్తుకు బాటలకు వేసుకొవాలి అని తెలిపారు.క్యాంపస్‌ మొత్తం సీసీ కెమెరాలతో నిఘా ఉందని, క్యాంపస్ చుట్టూ పోలీస్ ప్యాట్రోలింగ్, ప్రత్యేక నిఘా కొనసాగుతుంది అని పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యత అని ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు–కళాశాల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు డ్రగ్స్ దుర్వినియోగం, ముఖ్యంగా గంజాయి వినియోగం వల్ల కలిగే సమస్యలు, చట్టపరమైన శిక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం, నిల్వ, రవాణా, విక్రయం కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు . సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింక్స్, ఫిషింగ్ వంటి ఘటనలపై జాగ్రత్తలు పాటించాలి అని , అనుమానాస్పద వెబ్‌సైట్లు, లింకులు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెస్సేజ్ క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 సైబర్ హెల్ప్‌లైన్ ను సంప్రదించవచ్చని సూచించారు .విద్యార్థులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, డ్రగ్స్ మరియు సైబర్ ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని, సమాజంలో అవగాహన పెంచడంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి నాగేంద్ర గౌడ్ , మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సునీత, ఎన్. జి ఓ, ఎస్సై అనూష, పెద్దపల్లి జోన్ షీ టీమ్ ఇన్చార్జి ఎస్ ఐ లావణ్య, షీ టీమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మెడికల్ కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్థులు 500 మంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: