Friday, 31 July 2026 12:39:34 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి...

నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం

Date : 10 January 2026 04:48 PM Views : 328

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం అన్నారు.వారు స్థానిక నాయకులతో కలిసి నీలికుర్తి గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కంపచెట్లు, చెత్త చేదారాన్ని, ముళ్ళపొదలను జేసిబి తో తొలగించడంతో పాటు గ్రామంలో పారిశుధ్య పనులను చేపట్టి పిచ్చి మొక్కలను, సైడ్ కాలువలోని మట్టిని తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌతం మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో నీలికుర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నీలికుర్తి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలిపారు. నీలికుర్తి గ్రామంలో తాగునీటి, వీధిలైట్లు, మురికి కాలువల శుభ్రత తదితర వంటి అంశాలపై మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. చెత్తా ను రోడ్డు పై వేయవద్దని, నీటిని వృధాగా వదలకుండా డమ్మీలను ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వినోద్, నాయకులు తొట్టి శ్రీను, పాక భిక్షం, శరత్, నరేష్, వెంకన్న, కరుణాకర్, యాదగిరి, సోమయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :