ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని కొమురం భీమ్ విగ్రహం వద్ద కొమురం భీమ్ జయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నివాళులు రాజగోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు న్యాయవాది పంద్రం శంకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంకుశత్వానికి, దమననీతికి ఎదురు నిలిచి “జల్-జంగల్-జమీన్” నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడి తన ప్రాణాలను అర్పించిన మహోన్నత వీరుడు కొమురం భీమ్ అన్నారు. అనంతరం రాజ్ గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు పంద్రం శంకర్ మరియు రాజ్ గోండ్ సేవా సమితి నాయకులతో కలిసి కొమురం భీమ్ విగ్రహం వద్ద కొమురం భీమ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్తిత్వ పోరాటాలకు కొమురం భీమ్ ప్రతీక అని కుమ్రం భీమ్ ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినదామే స్ఫూర్తి గా తీసుకొని ఆదివాసీ హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాజ్ గోండ్ సేవా సమితి ఉపాధ్యక్షులు రామేల్లి భోజన్న, బోథ్ డివిజన్ అధ్యక్షులు దుర్వ విశ్వశ్వర్ రావు ఉపాధ్యక్షులు కుర్మే రాజన్న బోథ్ మండల గౌరవ అధ్యక్షులు తొడసం గోపాల్, అధ్యక్షులు కనక అమృత్ రావు,ఉపాధ్యక్షులు మండాడి మోహన్, సలహా దారులు మండాడి రాము, సభ్యులు ఆత్రం మోహన్, మాడవి కృష్ణ పాల్గొన్నారు.
Admin
E Nivas News