ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వేసవి దృష్య నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక సహాయ సహకారంతో మంథని పురపాలక సంఘం పరిధిలోని 2వ వార్డు ఎరుకల గూడెం పాండవుల గుడి, ముత్యాలమ్మ వాడ ముత్యాల పోచమ్మ గుడి వద్ద నీటి బోరు వేయించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. నీటి వసతి కొరకు ప్రత్యేక చర్యల్లొ భాగంగా ఏర్పాటు చేసిన బోర్లను ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం స్థానిక కౌన్సిలర్, వార్డు ప్రజలు చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు నూకలు కమల్, పెంటరి రాజు, నాయకులు సీపతి బానయ్య జమీల్, ఖాజా మోయినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News