Friday, 31 July 2026 08:27:23 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చిన్నగూడూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా జంపాలా శోభ

Date : 23 January 2026 07:40 PM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా జంపాలా శోభను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించింది. మహిళా విభాగంలో చురుకైన కార్యకర్తగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకురాలిగా గుర్తింపు పొందిన శోభకు ఈ బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా జంపాలా శోభ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం, అవకాశాలే తనకు ఈ బాధ్యత వచ్చేలా చేశాయని అన్నారు. మహిళల హక్కులు, భద్రత, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై మండల స్థాయిలో బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. గ్రామగ్రామాల్లో మహిళా కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీని కిందిస్థాయి వరకు బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు చేరేలా పర్యవేక్షణ చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తామని శోభ పేర్కొన్నారు. అవసరమైతే మహిళల కోసం ఉద్యమాలు, ధర్నాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జంపాలా శోభ నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో మహిళా విభాగం మరింత శక్తివంతంగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పునాది ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు శోభకు శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: