Thursday, 30 July 2026 06:10:08 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జగిత్యాల లో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Date : 10 March 2026 10:18 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2025 కు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు టీజీపీ ఈ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా విద్యుత్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.ఈ నిరసన లొ భాగంగా జేయేసి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని, ప్రైవేటీకరణ తొ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు తీవ్రమయిన నష్టం తీరని అన్యాయం జరగడమే కాకుండ నిరుద్యోగులకి ప్రభుత్వ కొలువులు రావని చెప్పారు, అలాగే రైతులకి, సామాన్య ప్రజలకి, చిన్న- మధ్య తరగతి పరిశ్రమలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సబ్సిడీలను క్రమ క్రమంగా ఎత్తి వేయాల్సి వస్తుందని, విద్యుత్ చార్జీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో పెరుగుతాయని అలాగే ప్రజల సొమ్ముతో కార్మికుల చెమటని చిందించి దశాబ్దాలుగా నిర్మించుకున్న వందలకోట్ల విలువైన లైన్స్ ని ప్రైవేట్ కంపెనీలకు నామ మాత్రపు చార్జీలకే ధారాదత్తం చేయవలసి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా స్టేట్ ఈ ఆర్ సి సభ్యులని తీసివేసే అధికారం పొందనుందని, దీనివలన రాష్ట్రాల హక్కులకు భంగం ఏర్పడుతుంది చెప్పారు. ఈ బిల్లు ద్వార ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలనుంచి విద్యుత్ ని అధిక ఛార్జీలకు కొనే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సవరణ బిల్ ని రద్దు చేసెంతవరకు వరకు మా నిరసనలు ఆగవని ఇంకా ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎస్ ఈ. సుదర్శనం మరియు జేయేసి నాయకులు చేరాలు, అజీజ్ , రాంజీ నాయక్, , సతీష్, అశోక్ రెడ్డి, భూమయ్య, అభీద్, గార్లు, మరియు పలు సంఘాల నాయకులు, విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :