Thursday, 30 July 2026 12:00:23 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అర్జునగుట్టలో గుడుంబా తయారీపై కోటపల్లి పోలీసుల దాడి...

35 లీటర్ల గుడుంబా స్వాధీనం...ముగ్గురిపై కేసులు నమోదు...

Date : 03 March 2026 02:46 AM Views : 221

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గ్రామాల్లో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కోటపల్లి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మొత్తం 35 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనంచేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేసి తయారీ సామగ్రిని కూడా సీజ్ చేశారు. నిందితులైన ఆకుదారి అనిల్ 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం చేశామన్నారు. అలాగే అట్టేలా మల్లయ్య వద్ద 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆకుదారి సదువలి వద్ద10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ముగ్గురిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక, ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు,టీజీఎస్పీ కానిస్టేబుళ్లు మల్లేష్, సాయికృష్ణ, నరేష్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :