Friday, 31 July 2026 01:54:50 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

28న మేడారం జాతర మహా కుంభమేళా ప్రారంభం..

వనదేవతలను దర్శించుకుంటున్న లక్షలాది మంది భక్తులు

Date : 27 January 2026 08:49 PM Views : 210

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వనదేవతల మహా కుంభమేళా జాతర జనవరి 28 బుధవారంతో ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ తోపాటు పగిడిగిద్దరాజు గోవింద రాజులను కూడాతీసుకురావడంతో జాతర మహా ఘట్టం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహణను చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని (బెల్లం) బంగారాన్ని సమర్పించుకున్నారు. మంత్రి సీతక్క సైతం అక్కడే ఉండి జాతర పర్యవేక్షణను చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. వచ్చే మూడు రోజులపాటు సమ్మక్క,సారలమ్మ పగిడిగిద్దరాజు వనం నుండి జనంలోకి రావడంతో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అధికార యంత్రాంగం అక్కడే ఉంది అనిర్వస్తులు ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లుచోటు చేసుకోకుండా పోలీసులుఅనువణువునా గాలిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే పరిస్థితి ఉన్నందున దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుండే వాహనాలకు పార్కింగ్ ను ఏర్పాటు చేశారు జాతరకు వాహనాల్లో వచ్చే భక్తులంతా ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలుపుకోవాలని పోలీసులుసూచించారు. అనవసరంగా జాతరలోకి వాహనాలు తీసుకువచ్చి ప్రజలకు ఆటంకం కలిగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :