ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ పౌరసరఫరాల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలోని మహనీయుడిచిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా సేవలందించారని, దేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
Admin
E Nivas News