Friday, 31 July 2026 09:56:51 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ధర్మపురి డిగ్రీ కళాశాలక (హెచ్ ఏఎల్) చేయూత../ రూ.10 కోట్లతో నూతన భవన నిర్మాణం...

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషి

Date : 25 June 2026 11:33 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ విద్యార్థులకు తీపి కబురు అందింది. ఉన్నత విద్యావకాశాలు విస్తరించే దిశగా చారిత్రక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో ధర్మపురిలో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకొచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మంత్రి కృషి ఫలితంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓ యు) కుదిరింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎ.వి. మురళీకృష్ణ, డీజీఎం (హెచ్‌ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్) ఎస్. సత్యనారాయణ సమక్షంలో అధికారులు ఎంఓయు పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, "ధర్మపురి ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన విద్య అందించేందుకు ఈ కళాశాల భవనం ఎంతో ఉపయోగపడుతుంది. హెచ్ ఏఎల్ సంస్థ సహకారానికి కృతజ్ఞతలు" అని తెలిపారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న ఈ నూతన భవనంలో ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. దీంతో ధర్మపురి, చుట్టుపక్కల మండలాల విద్యార్థులకు డిగ్రీ విద్య మరింత సులభతరం కానుంది. స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు మంత్రి కృషిని అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: