ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మెదక్ లో రాజకీయ కుట్రలు సాగుతున్నయని పట్టణ ప్రజలు పౌరులు సోదరాభావంతో వుండే వారని అధికారంతో ఇష్టనుసరంగా మాట్లాడుతున్నారని మెదక్ జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆదివారం మున్సిపాల్ ఎన్నికల సందర్బంగా మెదక్ పట్టణములోని 18,19 వార్డులలొ ప్రచారం చేశారు. గాంధీ నగర్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు బట్టి జగపతి మాట్లాడతూ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన సజావుగా సాగిందని ఇప్పుడు ఎన్నికల్లో నామినేషన్లు ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులపై బెందిరిపులు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల నుండి అభివృద్ధి జాడలేదూని వాపోయారు. మా ప్రభుత్వంలొ మెదక్ లొ అభివృద్ధి దూసుకుపోయ్యందాని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News