Thursday, 30 July 2026 01:32:40 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం..

Date : 20 February 2026 05:37 AM Views : 188

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు లు తలదాచుకున్న విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువైపుల నుంచీ హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనిభద్రతాబలగాలు వెల్లడించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు.. ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతిచెందగా.. వేలాది మంది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. పలువురు మావోలను ప్రభుత్వం ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 15మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ జాబితాలో రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మావోయిస్టు కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్‌, జోడే రత్నభాయి, బడే చొక్కారావుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇక ఈ రెండేళ్లలో 588 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందులొంగిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :