ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో సర్వీసులో ఉన్న ప్రభు త్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ప్రభుత్వ ఉపాధ్యా యుల కోసం నిర్వహిం చనున్న ప్రత్యేక టెట్ కు ఈనెల 21న నోటి ఫికేషన్ జారీ చేస్తామం టూ పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యా యుల టెట్ లో కంప్యూటర్ అథారిత పరీక్షలను సెప్టెంబర్ 7,11 తేదీల మధ్యన నిర్వహిస్తామన్నారు. అప్పటి వరకు ఉన్న సిలబస్ ఉంటుంద న్నారు. రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సిన ఇన్ సర్వీస్ టీచర్లు 20వేల మంది వరకు ఉండొచ్చన్నారు. కేజీబీవీల్లో పనిచేసే టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలన్నది ఏమీ లేదని వెల్లడిం చారు. నిబంధనల ప్రకారం అయితే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయు లకు సైతం టెట్ తప్పనిసరి అన్నారు.
Admin
E Nivas News