Thursday, 30 July 2026 01:36:37 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యుత్ కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

Date : 13 February 2026 08:22 AM Views : 119

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు ఐక్యమత్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని జాక్ నాయకుడు అజీజ్ హైమద్ పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రం పెట్టిన బిల్లులతో ఉద్యోగులందరికీ అన్యాయం జరుగుతుందని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జాక్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉపసంహరణ (సవరణ) బిల్లు 2025 నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026 కు ఇది కేవలం నిరసన కాదు, విద్యుత్ ఉద్యోగులమైన మన అస్తిత్వ సమరం అన్నారు. విద్యుత్ కార్మికులందరము ఐక్యంగా ముందుకు సాగుదాం అన్నారు. విద్యుత్ ఒక సాధారణ వస్తువు కాదు.ఇది ప్రజల ప్రాణాధారం మనీ దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క నాడి రైతు పంటకు ఊపిరి అన్నారు. విద్యార్థి భవిష్యత్తుకు వెలుగుఆసుపత్రిలో ప్రాణాలను కాపాడే శక్తి. మన విద్యుత్ ఉద్యోగులకేఉందన్నారు. రాత్రింబవళ్ళ శ్రమే, మన ప్రాణాల పణంగా చేసిన సేవ వల్లే ఈ దేశం వెలుగులో ఉందన్నారు. అలాంటి పవిత్రమైన ప్రజా సేవను కార్పొరేట్ లాభాల బారినపడేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యుత్ ఉపసంహరణ (సవరణ) బిల్లు–2025, నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ–2026 — ఇవి కేవలం పత్రాలపై ఉన్న పదాలు కావు. ఇవి మన భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలు మానుకోవాలన్నారు. ఇది కేవలం ఒక బిల్లు కాదు మన ఉద్యోగ భద్రతపై దాడి చేయడం అన్నారు. విద్యుత్ ఉద్యోగుల పాత పెన్షన్ హక్కులపై దాడి మన విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల& ఔట్‌సోర్సింగ్ కార్మికుల భవిష్యత్తుపై అనిశ్చితి దాడి అన్నారు. విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా పని భారాన్ని పెంచే విధానంవిద్యుత్ వినియోగదారులపై అధిక చార్జీల మోపే ప్రమాదం, ఉందని మౌనంగా ఉంటే విద్యుత్ కార్మికుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులు మన విద్యుత్ కార్మికుల భవిష్యత్తును విద్యుత్ కార్మికుల తలరాతను రాస్తారన్నారు. విద్యుత్ కార్మికులందరూ ఐక్యంగా నిలిస్తే విద్యుత్ కార్మికులందరి భవిష్యత్తును విద్యుత్ కార్మికులందరూ రాసుకుంటా మన్నారు. మన కార్మికులందరి న్యాయమైన డిమాండ్లతో విద్యుత్ కార్మికులందరివి పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ చేయాలన్నారు. విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీ పోస్టుల తక్షణ భర్తీ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకతఅందరికీ సరసమైన విద్యుత్ ఇవి స్వార్థపూరిత డిమాండ్లు కావన్నారు. ఇవి సమాజ న్యాయం కోసం చేసే పిలుపన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత అంటే శక్తి ఒక్కో కార్మికుడు ఒక్కొక్క దీపం అయితే విద్యుత్ కార్మికులందరూ ఐక్యంగా తెలిస్తే కార్మిక అందరి సమూహం ఒక సూర్యుడు అన్నారు. విద్యుత్ సంస్థలు పనిచేయుచున్న ఉద్యోగులపై దాడి అంటే — మొత్తం విద్యుత్ కుటుంబంపై దాడి అన్న భావన మనలో ఉండాలి. విభేదాలు మనల్ని బలహీనపరుస్తాయి. ఐక్యత మనల్ని అజేయుల్ని చేస్తుంది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరూ మౌనం ప్రదర్శించకుండా– విద్యుత్ కార్మికులందరూ ప్రతిఘటన చేయాల్సిన సమయం ఆసన్నమైనది చరిత్ర చెబుతోంది హక్కులు అడిగితే ఇవ్వరు… ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి. ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది మన ఆత్మగౌరవం కోసం. మన కుటుంబాల భద్రత కోసం. ప్రజల హక్కుల రక్షణ కోసం చేసే న్యాయమైన పోరాటం. విద్యుత్ కార్మికులారా… మన విద్యుత్ కార్మికులందరి చెమటతో ఈ దేశం వెలుగుతుంది. మన విద్యుత్ కార్మికులందరి శ్రమతో పరిశ్రమలు నడుస్తాయి. మన విద్యుత్ కార్మికులందరి సేవతో ప్రజల జీవితం సాఫీగా సాగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో జాక్ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: