ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కాళేశ్వరంలో స్టోన్ క్లాడింగ్,పార్కింగ్ టైల్స్ మ రియు మ్యూజియం నిర్మాణ పనులను పరిశీ లించి పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ నే వేగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇరిగే షన్ శాఖ అధికారులకు సూచించారు. ఈసందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల దృష్ట్యా అన్ని ఏ ర్పాట్లు సమయానికి పూర్త య్యేలా చర్యలు తీసుకో వాలని,తెలిపారు.ముఖ్యంగా మ్యూజియం నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయా లని అధికారులను ఆదేశిం చారు.అలాగే,పార్కింగ్ స దుపాయాలు మరియు ఘాట్ పరిసరాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే పనులను సమర్థవంతంగా నిర్వహించాలనిపేర్కొన్నారు.అధికారులుసమన్వయంతో పనిచేసి పనులను గడు వులోపుపూర్తి చేయాలని సూచించారు.ఈకార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు,ఇరిగేషన్ ఈ ఈ తిరుపతిరావు,ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్,కాటారం డిఎ స్పీ సూర్య నారాయణ,త హసీల్దార్,సత్యనారా యణ స్వామి,ఎంపిడిఓ రవీంద్రనా థ్,దేవస్థానం ఈఈ మహే ష్,సర్పంచ్ మోహన్ రెడ్డి,పి ఏసీఎస్ చైర్మన్ తిరుపతి రె డ్డి తదితరులు పాల్గొన్నా రు.
Admin
E Nivas News