Thursday, 30 July 2026 01:28:55 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రెండొవ విడత ఎన్నికలకు భారీ బందోబస్తు

సిపి.అంబర్ కిషోర్ ఝా

Date : 13 December 2025 08:26 PM Views : 208

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరిగిందని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని శనివారం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ పరిధిలో రెండోవ విడుత పాలకుర్తి , అంతర్గం , జూలపల్లి , ధర్మారం 04 మండలాలలో 73 గ్రామపంచాయతీలు .97పోలింగ్ కేంద్రాలలో, .684పోలింగ్ లొకేషన్స్, మంచిర్యాల జోన్ పరిధిలో బెల్లంపల్లి , కన్నేపల్లి , భీమిని, తాండూర్, నేన్నెల, కాసిపేట్, వేమనపల్లి 7 మండలాలలో114. గ్రామపంచాయతీలు,11పోలింగ్ కేంద్రాలలో,724 పోలింగ్ లొకేషన్స్. మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1680 మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-1161. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు-..519 ఉన్నాయన్నారు. రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశామన్నారు. డీసీపీ 2 , ఏసీపీ – 7, సీఐలు – 30, ఎస్‌ఐలు – 95, ఏఎస్‌ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు– 270, కానిస్టేబుళ్లు – 520, హోం గార్డులు – 240, ఆర్ముడ్ సిబ్బంది –190, క్యూఆర్టి టీమ్స్ – 32, రూట్ మొబైల్ పార్టీలు – 62, మిగతా సిబ్బంది, సుమారు 200, మొత్తంగా సుమారు 1700 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనరేట్ పరిధిలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశాం. చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశాం. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, స్థానిక పోలీస్, డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలు ప్రశాంత వాతావర ణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి అని సీపీ తెలిపారు. పోలీస్ సిబ్బందితో రూట్ మొబైల్స్, స్ట్రెకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కమీషనరేట్ లో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుటకు క్రిటికల్ పోలింగ్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించడం జరిగిందని సీపీ అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :