ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన అజీస్ పటేల్ జొన్న పంట కాలిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం పంట పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ దేవపూర్ గ్రామానికి చెందిన అజీస్ పటేల్ కు సంబంధించిన 6 ఎకరాల జొన్న పంట పూర్తిగా కాలిపోవడం బాధాకరమని అన్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని రైతు అజీస్ పటేల్ కు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేవలం వరి పంటలకే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో పండించే అన్ని పంటలకు రూ. 500 బోనస్ అందిస్తే రైతులకు ఊరట కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News