Friday, 31 July 2026 06:21:21 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపు లకు అనుమతి లేదు

జిల్లా ఎస్పీ నితిక పంత్

Date : 13 February 2026 09:01 AM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నితికాపంత్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా చూసేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, కౌంటింగ్ కేంద్రాల వెలుపల 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమలులో ఉంటుందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, డాగ్ స్క్వాడ్ టీమ్స్, బాంబు డిస్పోసల్ టీమ్స్,స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచనునట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎస్పీ ప్రజలకు, అభ్యర్థులకు, గెలిచిన వారిని ఉద్దేశించి ముఖ్య సూచనలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలి.ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చటం, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదుశాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధించామన్నారు.జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, గొడవలు అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకువిరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై రిమాండ్ లోకి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించుట కొరకు సంబంధిత అధికారుల ఉత్తర్వుల మేరకు వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలి. ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే, లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :