Thursday, 30 July 2026 02:32:10 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

జనసంద్రంగా మారిన మేడారం మహా జాతర

గాలిలోకి కాల్పులు జరిపి ఆహ్వానం పలికిన ఎస్పి

Date : 29 January 2026 10:17 PM Views : 211

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చిలకలూరి గుట్ట నుంచి గద్దపైన కొలువుదీరిన సమ్మక్క మేడారం మహాజాతర గురువారంతో పరిపూర్ణంగా దర్శనాలు భక్తజనానికి ప్రారంభమయ్యాయి. సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి బయలుదేరగాలని జిల్లా ఎస్పీ ఏకే -47 తో గాలిలో కాల్పులు జరపగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ మ్మవారిని ఆహ్వానించగా, అశేష జన సందోహం మధ్య నుండి నాలుగు అంచల పోలీసు భద్రత మధ్య కుంకుమ భరణి రూపంలో గద్దె వద్దకు రాగానే కోయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గద్దెలపై కొలువు తీర్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల యొక్క కోరిక సమ్మక్క జన సందోహంలోకి రాకతో పూర్తిస్థాయిలో నెరవేరింది. భక్తులంతా సమ్మక్క సారలమ్మ పగడికిద్దరాజు గోవిందరాజులను దర్శించుకుని మొక్కులు అప్పజెప్పుకుంటున్నారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి స్వాగతం పలుకుతూ వారి యొక్క మొక్కలు చెల్లించుకున్నారు. సమ్మక్క రాకతో కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. వన దేవతలను దర్శించుకోవడానికి చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తల్లి రావడంతో మేడారం ఇసుక వేస్తే రాలనంత పరిస్థితి ఏర్పడింది. భక్తులంతా ముందు మేడారం చేరుకోగానే జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శనం చేసుకుని బంగారం బెల్లం సమర్పించుకుంటున్నారు. అలాగే నైవేద్యం రూపంలో మేకలు కోళ్లను బలి ఇస్తూ అమ్మవారికి మొక్కిన మొక్కులను అప్పజెప్పుతున్నారు. మేడారంలో వనదేవతల ప్రత్యేకత ఏమంటే దేవతల వద్ద ఏమి కోరిక కోరిన కూడా కచ్చితంగా నెరవేరుతుందని నమ్మకంతోని నేడు కోట్లాదిమంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని పునీతులు అవుతున్నారు. వచ్చిన భక్తులకు సైతం పోలీస్ యంత్రాంగం 500 అంచల పోలీసు భద్రత ఏర్పాటు చేసి డేగ కన్నుతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను పోలీసులు పరిశీలిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని వారి ఎత్తు బెల్లం(బంగారం) సమర్పించుకున్నారు. వీరికి మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ఇప్పటికీ మేడారం వైపే దారులన్నీ పలు రకాల వాహనాలతో క్రిక్కిరిసిపోయాయి. అటు బస్సులే కాకుండా భక్తులు తమ సొంత వాహనాలలో కూడా భారీగా తరలి రావడంతో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలను ఆపి కాలినడకన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన భక్తులకు పలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారు. ఏది ఏమైనా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే వనదేవతల జాతర ఈ ఏడు ఎప్పుడు ఎరగని స్థాయిలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :