Saturday, 25 April 2026 10:53:52 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ..

రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Date : 17 April 2026 10:00 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర రాజకీయ పరిణామంచోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పరిటాల సునీత సహా పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పరిటాల సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం వివిధ పార్టీల నేతలు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.ప్రస్తుతం టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇలా భిన్న రాజకీయ ధ్రువాలకు చెందిన నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో పాత పరిచయాల కారణంగానే మర్యాదపూర్వక భేటీ అని భావిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :