ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామ సమీపంలో ఉన్న చెంచు కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామ చెంచుగూడాన్ని సందర్శిస్తూ డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చెంచుగూడెంలో నివసిస్తున్న చెంచులకు ఐటిఐఎ అధికారులు ఎలాంటి ప్రభుత్వ పథకాలు దరిచేరకుండా చేస్తున్నారని కనీసం ఇంతవరకు ఐటీడీఏ అధికారులు చెంచుగూడాన్ని సందర్శించిన దాఖలు లేవని ఆయన మండిపడ్డారు. బోరుకు త్రాగునీరు అందడం లేదని ఇంకా లోతుగా రెండు పైపులు వేస్తే నిరంతరం త్రాగునీరు ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తొందరగా రెండు పైపులు వేసి, త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. చెంచులకు ఐటీడీఏ అధికారులు వ్యవసాయ భూమి చూపించాలని ఆయన అన్నారు హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వారు కట్టుకున్న ఇళ్లకు వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూడాలని ఆయన ఆయన అన్నారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కు మరియు ఎమ్మెల్యే కి తెలియజేస్తారని ఆయన అన్నారు.
Admin
E Nivas News