ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థాయి కార్యక్రమం ద్వారా మొత్తం 192 అర్జీలు వచ్చాయని.. వీటిలో 54 రెవెన్యూ అర్జీలు కాగా, 138 రెవెన్యూయేతర అర్జీలు ఉన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నాన్ రెవెన్యూ అర్జీల్లో పురపాలక శాఖకు సంబంధించి 31, పోలీసు శాఖకు 27, డీఆర్‌డీఏకు 25, పంచాయతీరాజ్ శాఖకు 12 అర్జీలు వచ్చాయన్నారు. విద్యుత్, పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖలకు అయిదు చొప్పున అర్జీలు రాగా సీఆర్‌డీఏకు సంబంధించి నాలుగు అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. వ్యవసాయం, ఇరిగేషన్‌కు మూడు చొప్పున అర్జీలు రాగా, విద్య, నైపుణ్యాభివృద్ధి, సర్వే, సాంకేతిక విద్యకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. ప్రజా రవాణా, ఎండోమెంట్, మైనారిటీ సంక్షేమం, ఎల్‌డీఎం, పరిశ్రమలు, మైన్స్, కాలుష్య నియంత్రణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, రహదారులు-భవనాల శాఖలకు ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు సరైన పరిష్కారం చూపడంలో చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News