Friday, 31 July 2026 11:24:22 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జూటూరు గ్రామం వద్ద హైవేపై బస్సుషెల్టర్ కట్టాలని కోరుతూ రాస్తారోకో చేసిన ప్రజలు

ఎన్ హెచ్340సి రహదారి నిర్మాణంలో షెల్టర్ తొలగింపుతో - విద్యార్థులు, మహిళల అవస్థలు

Date : 12 July 2026 08:51 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఎన్ హెచ్340సి జాతీయ రహదారి నిర్మాణంలో పాత బస్సు షెల్టర్ ను తొలగించడంతో జూటూరు, కోల్సు ఆనందపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, షెల్టర్ ను తిరిగి నిర్మించాలని ఆదివారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామానికి వెళ్లే దారికి ఎదురుగా ఉన్న ఎన్ హెచ్ 340సి జాతీయ రహదారిపై గతంలో ఉన్న పాత బస్సు షెల్టర్ ను రోడ్డు విస్తరణ పనులలో హైవే అధికారులు తొలగించారు. గ్రామం రహదారికి అర కిలోమీటర్ దూరంలో ఉండటంతో, బస్సు కోసం వచ్చే ప్రయాణికులు ఎండలో, వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నిలవడానికి కనీస సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, మహిళల అవస్థలు జూటూరు, కోల్స్ ఆనందాపురం గ్రామాల నుంచి దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు వెళ్లి ఆత్మకూరు, నందికొట్కూరు, పాములపాడు పట్టణాలలో చదువుకుంటున్నారు. బస్సు కోసం రోడ్డుపైనే గంటల తరబడి నిలబడాల్సి వస్తోందన్నారు. రాత్రి వేళల్లో బస్సు కోసం వేచి ఉండే మహిళలు, వృద్ధులకు భద్రత కరువైందనీ, షెల్టర్ లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి జూటూరు గ్రామానికి కొత్త బస్సు షెల్టర్ ను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి మరింత భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువ శక్తి సంఘం నాయకులు పెద్దన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :