ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మరియు ఎంపీపీ స్పెషల్ స్కూల్ ల హెడమాస్టర్ ల ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి స్కూల్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేటు విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులు ఉన్నాయన్నారు. కనుక లక్షలు ఖర్చుపెట్టి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో విడవకుండా, మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలు కలిగిన మంచి ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు మంచి విద్య బోధన కూడా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, గ్రామ అధ్యక్షులు మాండ్ర పురుషోత్తం రెడ్డి, స్కూల్ చైర్మన్ మౌలాలి, పంచాయతీ సెక్రెటరీ చంద్రశేఖర్, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, స్కూల్ హెడమాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News