Friday, 31 July 2026 03:37:05 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయం

వడ్డెర సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు పల్లపు మౌలాలి

Date : 11 January 2026 11:14 PM Views : 180

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని ఏపీ వడ్డెర సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు పల్లపు మౌలాలి అన్నారు. వారు కొత్తపల్లి మండల పరిధిలోని, జడ్డువారిపల్లి గ్రామంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను వడ్డెర సంఘం నాయకులతో కలిసి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డెర సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు పల్లపు మౌలాలి మాట్లాడుతూ రేనాటి ప్రాంతంలో జన్మించిన వడె ఓబన్న బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని తెలిపారు. రేనాటి పాలేగాళ్లకు, బ్రీటీష్ కంపెనీకి మధ్య బట్వారీ విషయంలో ఘర్షణలు ప్రారంభమైనప్పుడు ఆయన రేనాటి వీరుల పక్షాన నిలబడ్డారని గుర్తుచేశారు. క్రమేపి బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసేవారని, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చేసిన సాయుధ పోరులో వడ్డె ఓబన్న సైన్యాధక్షుడిగా వ్యవహరించారన్నారు. దట్టమైన నల్లమల అడవుల్లో సైతం ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసి, ఉరుకులు పెట్టించడంలో ముఖ్య భూమిని పోషించారని పేర్కొన్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముకలా ఆయన నిలిచారన్నారు. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లపు. ఉషనయ్య, టీ.రామకృష్ణ, చంద్రగిరి, మల్లేష్, టి.ఈదుస్వామి, చంద్రగిరి వెంకటేశ్వర్లు, మార్ల ఎల్లిశ్వరయ్య, టీ.పులయ్య, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :