Thursday, 30 July 2026 08:15:03 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

డాక్టర్ బత్తుల సంజీవరాయుడు(ట్రాయ్ కాగ్ సభ్యులు)

Date : 27 July 2026 03:11 PM Views : 52

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యమని ట్రాయ్ కాగ్ సభ్యులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తెలిపారు. డోన్ పట్టణంలోని, ఐటిఐ కళాశాలలో టెలికం వినియోగదారుల అవగాహన సదస్సు పిఎస్ఎస్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాయ్ కాగ్ మెంబర్-డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మాట్లాడుతూ టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ ప్రధాన బాధ్యతల్లో సెల్ వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించడం ఒకటి అన్నారు. మెరుగైన టెలికామ్ సేవలు అందించడం కోసం సెల్ కంపెనీలు అయిన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ మొదలగు కంపెనీల సేవలపై నిబంధనలు, ఆదేశాలు, పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉత్తర్వులను జారీ చేస్తుందని పేర్కొన్నారు. టెలికామ్ రంగంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా 110 కోట్ల మంది వినియోగదారులు మనదేశంలో మెరుగైన సేవలు ట్రాయ్ ద్వారా పొందుతున్నారన్నారు. వివిధ టెలికామ్ సేవలు మరియు కేబుల్ టీవీ సేవలు నాణ్యతా ప్రమాణాలను సమర్ధవంతంగా రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనే స్వతంత్ర నియంత్రణ సంస్థను రూపకల్పన చేసి అమలులోకి తెచ్చిందని చెప్పారు. అంతేకాక ట్రాయ్ నిబంధనల ప్రకారము, టారిఫ్ సిస్టం, వ్యాపార ప్రకటనల నిశిద్ధం, సేవల నాణ్యత ప్రమాణాలు, మొబైల్ నంబర్ పోర్టబుల్టి, సౌకర్యం విలువతో కూడిన సేవలు, రక్షణ, వినియోగదారుల హక్కులు మరియు మొబైల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ ఆవిర్భావ ఆశయం అన్నారు. ప్రస్తుత తారీఫ్ ఇతర కంపెనీల కంటే తక్కువగా బిఎస్ఎన్ఎల్ ఉండడమే కాక, బిఎస్ఎన్ఎల్ లో కూడా 4జీ సేవలు రావడం ద్వారా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరెడ్డి, డిటిఓ- పురంధరప్రసాద్, టిఓ- నాగేంద్ర ప్రసాద్, ఎటిఓ- శ్రీధర్, ఎటిఓ- జగన్ , ఏఇ- నాగరాజు, వడ్డే.నాగరాజ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: