ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు / పెద్దకాకాని : గుంటూరు జిల్లా, పెద్దకాకాని మండలంలోని, వెనిగళ్ళ గ్రామంలో ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థుల్లో విద్య ప్రాధాన్యత, మంచి అలవాట్లు, నైతిక విలువలపై అవగాహన పెంచేందుకు విజన్ ఆస్కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాడిపత్రి జిమ్మీ జోరా దంపతులు పాల్గొని, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “విద్యతో పాటు నైతిక విలువలు పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో కీలకం. విద్యార్థుల అభివృద్ధికి ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజన్ ఆస్కియా ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News