Friday, 31 July 2026 09:48:32 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాములపాడు మండలంలో ఘనంగా మెగా (పిటిఎం-4.0) పేరెంట్స్ -టీచర్స్ సమ్మేళనం

Date : 24 July 2026 10:45 PM Views : 55

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా (పిటియం-4.0) పేరెంట్స్ -టీచర్స్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ పాల్గొనగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఎం.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పాల్గొనడం జరిగింది. స్కూల్ పేరెంట్స్ డే సందర్భంగా తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఎం. వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, తదితర వక్తలు మాట్లాడుతూ ముఖ్యంగా తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి పిల్లలకి డబ్బులు అకౌంట్లో వేసి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో పడుతున్నాయని తెలిసి ప్రతి కుటుంబంలో మరియు పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి స్కూలులో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి రూ. 15,000 కేటాయించగా, అందులో రూ.2,000 పాఠశాలల అభివృద్ధికి మినహాయించి నేరుగా రూ. 13,000 తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నాణ్యమైన విద్య అందించే విధంగా పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కార్పొరేట్ ప్రవేట్ స్కూళ్ల కంటే దీటుగా ప్రభుత్వ స్కూలు ఏర్పాటు అయ్యాయని ప్రతి ఒక్క తల్లితండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చేర్పించండి అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథముగా నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారన్నారు. విద్యార్థుల చదువు నిరంతరం అభివృద్ధి చేసే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాము తల్లితండ్రులు పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చాలా సంతోషంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది అయినటువంటి డీకే.ఈశ్వర్ (ఫిజిక్స్), ఏ.హేమలత (తెలుగు), కే.రాజు (కెమిస్ట్రీ), కే.భాగ్యమ్మ (జువాలజీ), ఇ.రవీంద్ర (బాటని ), సి.భాగ్యలక్ష్మి (మాథ్స్), వి.అశోక్ రత్నం (హిస్టరీ), ఆర్.రత్న ప్రభ (ఇంగ్లీష్), కె.విజయభాస్కర్ (ఎకనామిక్స్), ఎన్.లక్ష్మణస్వామి (కామర్స్), నాటి చింగ్ స్టాఫ్ అయినటువంటి రామ తులసి, సచివాలయం బి.మాధవి, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం అధ్యాపకులు, ఉపాధ్యాయులు కే.శైలజ, కళ్యాణి, ఆయా పాఠశాలల, కాలేజీలల విద్యా కమిటీ చైర్మన్లు, సభ్యులు తదితరులు విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :