Friday, 31 July 2026 06:09:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

Date : 30 July 2026 09:49 PM Views : 26

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గురువారం ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జెసి కార్యాలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల పరిశుభ్రతను పరిశీలించారు. కార్యాలయ ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పరిశుభ్రమైన వాతావరణంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ పరిపాలన, రీ-సర్వే పెండింగ్ అంశాలు, ప్రజలకు అందిస్తున్న సేవల పురోగతిపై ఆత్మకూరు ఆర్డీవో, ఆత్మకూరు తహసీల్దార్, కొత్తపల్లి తహసీల్దార్, డీఐఓఎస్ ఆత్మకూరు తదితర రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన సేవా ప్రమాణాల (ఎస్ ఎల్ ఏ) గడువులోనే పరిష్కరించాలని సూచించారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏ (బియాండ్ ఎస్ ఎల్ ఏ) కేసులు ఏవీ ఉండకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రీ-సర్వే పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించే దిశగా, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ సూచించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీవో వెంకటశివ, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :